త్వరలో ఐఫోన్ యూజర్లు వాట్సాప్ వాడకం ఆపేస్తారు!!

త్వరలో ఐఫోన్ యూజర్లు వాట్సాప్ వాడకం ఆపేస్తారు!!

వాట్సాప్ చాలా ఏళ్లుగా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అత్యుత్తమ ఇన్ స్టెంట్ మెసేజింగ్ యాప్ గా పేరొందింది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఫోన్లు రెండిటిలోనూ నెంబర్ వన్ గా ఉంది. ఐఫోన్ వినియోగించేవారికి రెండో ప్రత్యామ్నాయంగా యాపిల్ డిఫాల్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ ఐమెసేజ్  ఉంటుంది. ఇందులో వాట్సాప్ లో ఉన్నన్ని ఫీచర్లు ఉండవు. కానీ ఇప్పుడు ఇందులో ఎన్నో కొత్త మార్పుచేర్పులు రాబోతున్నాయి. బ్లూమ్ బర్గ్ వార్తా కథనం ప్రకారం ఐమెసేజ్ లో త్వరలోనే వాట్సాప్ లో ఉన్నటువంటి ఫీచర్లు రానున్నాయి.

మిగతా ఫీచర్ల సంగతి ఎలా ఉన్నా ఒక ప్రత్యేకత గురించి సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఐమెసేజ్ లో ఇకపై యూజర్లు ప్రొఫైల్ పిక్చర్, డిస్ ప్లే పేరు పెట్టుకోవచ్చని చెబుతున్నారు. ఈ ఫీచర్ వాట్సాప్ లో ఎప్పటి నుంచో ఉంది. ఐమెసేజ్ లో చాట్, స్టికర్లు, ఎనిమోజీలు పంపేందుకు ఒక మెనూ ఉండటమే కాదు దీని సహాయంతో మీరు ఎన్నో రకాల పనులు చేయవచ్చు. ఎనిమోజీలను గత ఏడాది ఐఓఎస్ 12లో డబ్ల్యుడబ్ల్యుడీసీ కాన్ఫరెన్స్ లో ప్రకటించడం జరిగింది. డబ్ల్యుడబ్ల్యుడీసీ 2019లో ఐఫోన్ లో ఇవ్వబోయే అన్నీ కొత్త ఫీచర్ల గురించి సమాచారం ప్రకటిస్తారని అంటున్నారు.

తమకు యాపిల్ ఐమెసేజ్ నుంచి అత్యంత గట్టి పోటీ ఎదురవుతోందని గత ఏడాదే ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఎందుకంటే అమెరికాలో ఐమెసేజ్ బాగా పాపులర్. అక్కడ ప్రజలు ఐమెసేజ్ నే ఎక్కువగా వినియోగిస్తున్నారు. కంపెనీ తన ఫోన్లలో దీనిని డిఫాల్ట్ గా ఇస్తుండటంతో ఐమెసేజ్ వాట్సాప్ కంటే ఒకడుగు ముందే ఉందని జుకర్ బర్గ్ చెప్పారు. కానీ ఇప్పుడు యాపిల్ స్వయంగా ప్రకటించిన తర్వాత రాబోయే రోజుల్లో యాపిల్ వాట్సాప్ కి మరింత గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.