ఏ శ్లాబ్ కు ఎంత పన్ను?

ఏ శ్లాబ్ కు ఎంత పన్ను?

ట్యాక్స్‌ స్లాబ్స్‌లో ఎలాంటి మార్పు లేదు. మోడీ బడ్జెట్‌లో ఉద్యోగులకు గరిష్ఠంగా ఒక్కొక్కరికి దక్కింది గరిష్ఠంగా రూ. 12,500. రూ. 5 లక్షల లోపు అయితే ఈ మొత్తం. ఈ పరిమితి దాటితే మొత్తం కక్కాల్సిందే. మీ జీతం రూ. 4,99,999 ఉంటేనే మీకు  గరిష్టంగా రూ. 12,500 మిగులుతుంది. జీతం మూడు నాలుగు లక్షలైతే ఆదా అయ్యేది రూ.10,000. అలా జీతం బట్టి తగ్గుదల ఉంటుంది. మిగిలినవారికి ఎలాంటి మినహాయింపు లేదు.

శ్లాబులు ఇలా ఉండబోతున్నాయి
ట్యాక్స్‌ శ్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు. రూ.0-2.5 లక్షలకు పన్ను ఉండదు. రూ.2.5 లక్షలు-రూ.5 లక్షలలోపు ఆదాయం ఉంటే 5% పన్ను విధిస్తారు. అంటే మీరు గరిష్ఠంగా రూ.12,500 పన్ను పడుతుంది. కానీ సెక్షన్ 87ఏ కింద రూ.12,500 మినహాయింపు లభిస్తుంది. అంటే పన్ను పడదన్నమాట. ఆదాయ పరిమితి రూ.5 లక్షలు దాటితే మాత్రం మీరు రూ.2.5 లక్షలు మొదలు పన్ను చెల్లించాల్సి వస్తుంది. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్య ఆదాయం ఉంటే ఆదాయపన్ను 20% ఉండనుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. రూ.10 లక్షల పైన ఆదాయానికి 30% పన్ను పడనుంది. వీటికి సర్ చార్జి, సెస్ ల మోత అదనంగా మోగనుంది.

ప్రావిడెంట్ ఫండ్‌లో పెట్టుబడులు పెడితే రూ.6.5 లక్షల లోపు వరకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పొదుపుపై పన్ను మినహాయింపు ఇస్తారు. టీడీఎస్ పరిమితి రూ.40వేల నుంచి రూ.50వేలకు పెంచడం జరిగింది. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ రూ.10వేల నుంచి రూ.40వేలకు పెంచారు. సేవింగ్స్ పై రూ.40వేల వరకు పన్ను మినహాయించారు. స్టాండర్డ్ డిడక్షన్ రూ40వేల నుంచి రూ.50వేలకు పెరిగింది.