ఇటలీలో కరోనా వ్యాప్తికి ఆ చిన్న పొరపాటే కారణమా?
ఇటలీలో కరోనా వైరస్ వ్యాప్తి దారుణంగా ఉన్నది. ఆ దేశాన్ని ఈ వైరస్ అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రాభవం వలన ఇప్పటి వరకు 1300 మందికి పైగా మరణించారు. జనవరిలోనే ఈ వైరస్ ను అక్కడ గుర్తించారు. వైరస్ ను గుర్తించిన వెంటనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అయినప్పటికీ కరోనా ఈ స్థాయిలో ఇటలీలో వ్యాపించడానికి కారణం ఏంటి... ఎక్కడ పొరపాటు జరిగింది. తెలుసుకుందాం.
జనవరి 29 వ తేదీన ఇటలీలో రెండు కరోనా కేసులను కనుగొన్నారు. ఆ తరువాత వెంటనే ఆరు నెలల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ రెండు కేసులను పరిగణలోకి తీసుకొని చైనా నుంచి వచ్చే విమానాల రాకపోకలను నిషేదించారు. కానీ, 20 రోజుల్లో పరిస్థితి మొత్తం తలక్రిందులైంది. దీనికి కారణం ఉన్నది. జనవరి 29 వ తేదీన రెండు కేసులు నమోదుకాగా, మూడో కేసు ఫిబ్రవరి 18 వ తేదీన కోడోగ్నో పట్టణంలో కనుగొన్నారు. అయితే, దానిని సాధారణ ఫ్లూ అని అనుకోని డాక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. ఆ విధంగానే ట్రీట్మెంట్ చేశారు. కరోనా వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లారు.
ఆ తరువాత ఫ్లూ లక్షణాలతో పదుల సంఖ్యలో హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యారు. పరిస్థితి అర్ధం చేసుకొని కరోనా వ్యాధిని గుర్తించే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫిబ్రవరి 23 వ తేదీన కోడోగ్నో పట్టణంలో రెండు మరణాలు సంభవించాయి. ఈ రెండు మరణాలతో అక్కడి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. మొదట పట్టణాలను నిర్బంధంలోకి తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు దేశం మొత్తాన్ని నిర్బంధంలోకి తీసుకొచ్చింది. కోడోగ్నో పట్టణంలో ఫ్లూతో వచ్చిన వ్యక్తిని సరిగ్గా ట్రీట్మెంట్ చేసి ఉంటె ఈరోజున ఇటలీ ఈ స్థాయిలో ఇబ్బందులు పడేది కాదని చెప్పొచ్చు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)