చరణ్ హీరో కాకపోయి ఉంటె..

చరణ్ హీరో కాకపోయి ఉంటె..

చరణ్ తన కెరీర్లో 12 సినిమాలు చేశారు.  ఇందులో చాలా సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.  మగధీర, రంగస్థలం సినిమాలు కెరీర్లో బెస్ట్ గా నిలిచాయి.  ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  

ఇదిలా ఉంటె, సినిమాల్లోకి రాకముందు చరణ్ కు సినిమాపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట.  మెకానికల్ ఇంజనీరింగ్ చదివి యూరప్ లో మంచి ఉద్యోగంలో స్థిరపడాలని చరణ్ అప్పట్లో అనుకునేవాడట.  ఇంటికి వచ్చే నిర్మాతలు సినిమా ఎప్పుడు చేస్తున్నావు అని పదేపదే అడగటం వలన సినిమాలోకి రావలసి వచ్చిందని ఓ సందర్భంలో చరణ్ చెప్పాడు.