ఆ సినిమా నుంచి తప్పుకొని ఈ ఇద్దరు ఎంత తప్పుచేశారో..!!

ఆ సినిమా నుంచి తప్పుకొని ఈ ఇద్దరు ఎంత తప్పుచేశారో..!!

సక్సెస్ ఉంటేనే సినిమా లైఫ్ లో ఉంటారు.  లేదంటే ఎలా వచ్చారో అలాగే ఫేడౌట్ అయిపోతారు.  ఇది ఎందరి విషయంలోనో రుజువైంది.  తాజాగా లావణ్య త్రిపాఠి, అను ఇమ్మానుయేల్ లో ఓ సూపర్ హిట్ సినిమాను వదులుకొని చెప్పుకోలేనంత తప్పు చేశారు.  వాళ్ళు వదిలేసుకున్న సినిమా ఇప్పుడు సూపర్ హిట్ అయింది.  భారీ ఎత్తున వసూళ్లు రాబడుతున్నది.  వీళ్ళు వదులుకున్న సినిమా ఏంటో ఇప్పటికే అర్ధమయ్యి ఉండాలి.  అదే గీత గోవిందం.  

విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో మొదట లావణ్య త్రిపాఠిని అనుకున్నారు. దర్శకుడు పరశురామ్ కూడా కన్ఫర్మ్ చేశాడు.  తమిళంలో ఓ ఆఫర్ రావడంతో లావణ్య ఈ సినిమాను వదులుకొని అటు వెళ్ళిపోయింది.  డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఇలా చేసినట్టు తెలుస్తుంది.  

లావణ్య తరువాత అను ఇమ్మానుయేల్ కు అవకాశం వచ్చింది.  కొన్ని సీన్స్ కూడా షూట్ చేశారు.  నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు నుంచి ఆఫర్ రావడంతో అను అటువైపు వెళ్ళింది.  చివరికి అవకాశం రష్మికకు దక్కింది.  గీత గోవిందం సూపర్ హిట్ కావడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టుతుండటంతో పాపం ఈ ఇద్దరు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు.  ఏదైనా రాసిపెట్టి ఉండాలంటారు.