పన్ను రాయితీతో ప్రయోజనమెందరికి?

పన్ను రాయితీతో ప్రయోజనమెందరికి?

రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. ఇప్పటి వరకు ఆదాయ పరిమితి రూ. 2.5 లక్షలు కాగా దానిని ఒకేసారి రూ.5 లక్షలకు పెంచారు. రూ.5 లక్షల వార్షికాదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు. రూ.5 లక్షల పైబడి ఆదాయం ఉన్నవారికి పన్నుపోటు ఎప్పటిలాగే ఉండనుంది. అయితే, ఆదాయపు పన్ను చట్టంలో శ్లాబులు మాత్రం మార్చలేదు.  ఈ పన్ను రాయితీతో ప్రయోజనం ఎంత? అంటే చాలా తక్కువనే చెప్పాలి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారి సంఖ్యను బట్టి చూస్తే ఈ పన్ను మినహాయింపుతో కేవలం 79,56,997 మంది మాత్రమే ప్రయోజనం పొందనున్నారు. మిగిలినవాళ్లంతా పాత పద్ధతిలో రూ.2.5 లక్షల నుంచే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.