సాహో సేఫ్ కావాలంటే.. !!

సాహో సేఫ్ కావాలంటే.. !!

సాహో మూవీ మరో నాలుగు రోజుల్లో థియేటర్లోకి రాబోతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది.  గతేడాది సౌత్ నుంచి భారీ క్రేజ్ తో రిలీజైన సినిమా 2పాయింట్ 0.  ఆ రేంజ్ క్రేజ్ తోనే ఇప్పుడు సాహో రిలీజ్ కాబోతున్నది.  దాదాపు రూ. 320 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం అందుతుంది.  

దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ.350 కోట్ల వరకు షేర్ రావాలి.  అలా వస్తేనే సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. బాహుబలి సినిమాల మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే.. సినిమాకు లాభాలు రావడం పెద్ద విషయం ఏమీకాదు.  ఒకవేళ నెగెటివ్ టాక్ వస్తేనే ఎలా అన్నది ఆలోచించాలి.  ప్రభాస్ తో పాటు అయన ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  సెన్సార్ టాక్ ప్రకారం మూవీ అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తోంది.  ఎలా ఉంది ఏంటి అన్నది తెలియాలంటే ఆగష్టు 30 వ తేదీ వరకు ఆగాల్సిందే.