రానా వల్లనే పూజకు అక్కడ అవకాశం

రానా వల్లనే పూజకు అక్కడ అవకాశం

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరు పూజా హెగ్డే.  కెరీర్ స్టార్టింగ్ లో చేసిన సినిమాలు పెద్దగా ఆడకపోయినా... అల్లు అర్జున్ డీజే సినిమా తరువాత సినిమా ఈ అమ్మడి స్టార్ హోదా ఒక్కసారిగా మారిపోయింది.  అరవింద సమేత సినిమా సూపర్ హిట్ కావడంతో తిరిగి గాడిలో పడింది ఈ అమ్మడి కెరీర్.  ఆ తరువాత మహేష్ తో చేసిన మహర్షి భారీ హిట్ కొట్టడంతో కెరీర్ ఫుల్ స్వింగ్ అయింది.  

పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తోంది.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది.  జాన్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.  ఈ సినిమా హిట్టయితే చెప్పాల్సిన పనిలేదు.  ఇలా టాలీవుడ్ లో హాట్ హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు, అటు బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తో హౌస్ ఫుల్ 4 చేస్తోంది.  అక్షయ్ కుమార్, రితీష్ దేశ్ ముఖ్, రానా తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్, కృతి కర్బందలు కూడా నటిస్తున్నారు.  వీరితో పాటు పూజా హెగ్డే కూడా నటిస్తోంది.  

ఈ సినిమాలో అవకాశం రావడానికి రానా కారణం అని తెలుస్తోంది.  రానా రికమండేషన్ కారణంగానే పూజాకు ఆ సినిమాలో అవకాశం వచ్చిందని తెలుస్తోంది.  సినిమా ఫైనల్ షెడ్యూల్ నడుస్తోంది.  కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్టయితే బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.