అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!!

అప్పుడు భయపడ్డాడు.. ఇప్పుడు బాలీవుడ్ ను భయపెడుతున్నాడు..!!

2002 నవంబర్ 11 వ తేదీన ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వర్ మూవీ రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా పెద్ద విజయం దక్కించుకోకపోయినా.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.  దీని తరువాత రాఘవేంద్ర సినిమా చేశాడు.  అదీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.  అప్పుడు ప్రభాస్ ఓ మాట అనుకున్నాడట.  తన సినిమాలను ఎవరైనా చూస్తారా లేదా.. తాను హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అవుతానా లేదా అనుకున్నాడట.  ఆ తరువాత 2004లో వర్షం సినిమా చేశాడు.  అది ప్రభాస్ కెరీర్ను మలుపు తిప్పింది.  వర్షం సినిమా బాక్సాఫీస్ హిట్ కొట్టింది.  అప్పటి నుంచి ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.  

ఈ వర్షం, ఛత్రపతి తరువాత దాదాపు ఐదేళ్లపాటు పెద్ద హిట్ లేదు.  2010లో డార్లింగ్ వచ్చింది.  ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  ఆ తరువాత మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి సీరీస్, ఇప్పుడు సాహో.. బాహుబలితో సాధ్యం కాదని అనుకున్న రికార్డులు సాధించాడు.  అలానే, బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఇప్పుడు అక్కడ ప్రభాస్ కు భారీ ఫ్యాన్స్ ఉన్నారు.  ప్రభాస్ సాహో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.  ప్రభాస్ బాలీవుడ్లో సెటిల్ కావాలని, బాలీవుడ్లో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  ఈశ్వర్ సమయంలో హీరోగా సెట్ అవుతానా లేదా అనుకున్న ప్రభాస్, బాహుబలి తరువాత అభిమానులకు ఇంకా కొత్తగా ఎలాంటి సినిమాలు ఇవ్వాలి.. ఎలా కొత్తగా కనిపించాలని ఆలోచిస్తున్నారట.  17 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో చూశారా..