ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ను ఎలా కూల్ చేశాడు..!!

ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ ను ఎలా కూల్ చేశాడు..!!

రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో సినిమా అనగానే మెగా నందమూరి ఫ్యాన్స్ కు పెద్ద పండుగనే చెప్పాలి.  ఇద్దరు టాలీవుడ్ లో స్టార్ హీరోలే.  స్టార్ హీరోల సినిమాలను హ్యాండిల్ చేయాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో చెప్పక్కర్లేదు.  మల్టీస్టారర్ సినిమా అంటే ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి.  మెగా, నందమూరి హీరోలతో రాజమౌళి మల్టీస్టారర్ సినిమాను నిన్ననే ప్రారంభించారు.  ఎప్పుడైతే ప్రారంభం చేశారో అప్పుడే వారి ఫ్యాన్స్ హీరోలకు సంబంధించిన సినిమాను RC13 అని, NTR29 అని ట్విట్టర్ లో మూవీ గురించి షేర్ చేసుకుంటున్నారు.  

ఇలాంటి ఇబ్బందులు వస్తాయని రాజమౌళి ముందుగానే ఆలోచించి సినిమాకు వర్కింగ్ టైటిల్ గా RRR ను తీసుకున్నారు.  ఫ్యాన్స్ ఎలా షేర్ చేసుకున్నా వర్కింగ్ టైటిల్ ఆర్ఆర్ఆర్ కాబట్టి అధికారికంగా వచ్చే సమాచారం అంతా ఈ పేరుమీదనే ఉంటుంది.  మరోవైపు ఈ సినిమా ఏ జానర్లో ఉంటుంది అనే విషయాన్ని రాజమౌళి రివీల్ చేయకపోవడానికి ఫ్యాన్స్ వలన వచ్చే ఇబ్బందులు కూడా ఒక కారణం అని అంటున్నారు.  ఎవరి పాత్రను తక్కువ కాకుండా రాజమౌళి ఎలా డీల్ చేస్తాడో చూడాలి.