మరో పది వస్తేనే.. శైలజా సేఫ్ అయినట్టా..!!

మరో పది వస్తేనే.. శైలజా సేఫ్ అయినట్టా..!!

శైలజా రెడ్డి అల్లుడు డివైడ్ టాక్ ను సొంతం చేసుకున్నా.. వసూళ్లు మాత్రం బాగానే రాబట్టుకుంది.  వినాయక చవితి రోజున రిలీజైన ఈ సినిమా నాలుగు రోజుల్లో రూ.14.50 కోట్ల షేర్ ను రాబట్టింది.  వీకెండ్ కావడంతో సినిమాకు కలిసి వచ్చింది.  పైగా కామెడీ జానర్లో సినిమా ఉండటం ప్లస్ అయింది.  అంతేకాదు, ఈ సినిమాతో పాటు కలిసి రిలీజైన యూటర్న్ సినిమాకు క్రిటిక్స్ పరంగా మంచి మార్కులు పడ్డాయి.  హర్రర్ జానర్లో సినిమా ఉండటంతో.. ఆ జానర్ను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రమే థియేటర్కు వెళ్తున్నారు.  

శైలజా రెడ్డి అల్లుడు థియేట్రికల్ బిజినెస్ రూ.24 కోట్ల వరకు జరిగింది.  మరో పదికోట్ల మేర వసూళ్లు చేస్తేనే... సినిమా సేఫ్ అయినట్టు.  వీక్ డేస్ లో కూడా వసూళ్లు తగ్గకుండా రాబట్టుకుంటే.. సినిమా సేఫ్ అవుతుంది.  వచ్చే శుక్రవారం రోజున సుదీర్ బాబు నన్ను దోచుకుందువటే, విక్రమ్ స్వామీ స్క్వేర్, అర్జున్ కురుక్షేత్రం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  ఇందులో రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలు కాగా ఒకటి స్ట్రైట్ సినిమా.  ఈ మూడింటిలో రెండు హిట్ టాక్ ను సొంతం చేసుకున్నా.. వాటి ప్రభావం శైలజాపై పడే అవకాశం ఉంటుంది.