గేమ్ ఓవర్ అవకాశం తాప్సికి ఎలా వచ్చిందంటే..!!

గేమ్ ఓవర్ అవకాశం తాప్సికి ఎలా వచ్చిందంటే..!!

గేమ్ ఓవర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి విమర్శకుల మెప్పును పొందింది.  తెలుగులో ఎలా ఉన్నా.. అటు బాలీవుడ్, కోలీవుడ్ లో మాత్రం సినిమా సూపర్ గా ఆడుతున్నది.  మంచి కలెక్షన్లు వసూలు చేస్తున్నది.  సైకలాజికల్ డిఫెక్ట్ ఉన్న పాత్రలో తాప్సి నటన మెప్పించింది.  

అయితే, ఈ సినిమాకు మొదటి ఆప్షన్ తాప్సి కాదట, మొదట ఈ కథను నయనతారకు వినిపించాడు దర్శకుడు.  కథ సూపర్ గా ఉన్నది.  కానీ, నయనతారకు ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా చేయలేనని చెప్పింది. అలా ఆ అవకాశం నయనతార నుంచి తాప్సికి వచ్చింది.  తాప్సి డిఫరెంట్ కథలతో వరసగా సినిమాలు చేస్తుండటం విశేషం.