మీరు ఇంటర్నెట్ బానిసలా... ఇలా చేస్తే విముక్తి కావొచ్చు... 

మీరు ఇంటర్నెట్ బానిసలా... ఇలా చేస్తే విముక్తి కావొచ్చు... 

సాంకేతిక విప్లవం తరువాత ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైంది.  తక్కువ ధరకే నెట్ డేటా వస్తుండటంతో నెట్ ను వినియోగించే వారిసంఖ్య పెరిగిపోతున్నది.  ఇక యువత ఇప్పుడు ఇంటర్నెట్ ను బాసిన అవుతున్నది.  నిద్రకూడా పోకుండా నెట్ ను వినియోగిస్తున్నారు.  బానిసలుగా మారిపోతున్నారు.  దీని నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు.  

కొంత ఇబ్బంది అయినప్పటికీ కొన్ని నియమాలు పాటిస్తే తప్పకుండా ఈ బానిసత్వం నుంచి బయటపడొచ్చని అంటున్నారు.  వారంలో ఒకరోజు ఉపవాసం చేసినట్టుగా డిజిటల్ ఉపవాసం చేస్తే తప్పకుండా దీని నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఆరోజున ఫోన్ కు దూరంగా ఉండాలని, ఆ సమయాన్ని పుస్తకాలు చదవడానికి వినియోగిస్తే.. తప్పకుండా ఇంటర్నెట్ బానిసత్వం నుంచి బయటపడొచ్చని అంటున్నారు నిపుణులు.