ఐపీఎల్ తో మళ్ళీ బుకీల ఆశాలకు రెక్కలు...

ఐపీఎల్ తో మళ్ళీ బుకీల ఆశాలకు రెక్కలు...

ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానులకు మాత్రమే కాకుండా బుకీలకు కూడా పండగే. ఇక ఈ ఏడాది కూడా ఐపీఎల్ ను క్యాష్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు బుకీలు. అయితే గతంలో గెలుపు ఓటముల పైన మాత్రమే పందెం కాసే బుకీలు ప్రస్తుతం టాస్ నుండి మ్యాచ్ లో ప్రతిబంతి పై కూడా పందెం కాస్తున్నారు. వారు దీనిని ఫ్యాన్సీ బెట్టింగ్ అని పిలుస్తారు. దీనితో పాటు ఓ బ్యాట్స్మెన్స్ ఎన్ని పరుగులు చేస్తాడు అనేదాని పై కూడా పందెం కడుతారు. అయితే ఈ బెట్టింగ్ లో పాల్గొనే వారిలో ఎక్కువగా యువత, విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఇక కొంతమంది యువకులు, విద్యార్థులను బుకీలు కలెక్షన్ బాయ్స్ గా ఉపయోగించుకుంటున్నారు. కొందరు కొరియర్లుగా, సబ్ బుకీలు గా పనిచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. అయితే ఐపీఎల్ ను ఎంజాయ్ చేయాలి తప్ప దానిని ఓ గ్యాంబ్లింగ్ గా చూడవద్దు అంటున్నారు పోలీసులు.