లాక్ డౌన్ సిత్రం: కుందేలును బోల్తా కొట్టించి... డోర్ తీసుకొని లోపలికి వచ్చింది...

లాక్ డౌన్ సిత్రం: కుందేలును బోల్తా కొట్టించి... డోర్ తీసుకొని లోపలికి వచ్చింది...

లాక్ డౌన్ సమయంలో మనకు కొన్ని కొన్ని విచిత్రమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.  ఎప్పుడూ అడవుల్లో నివసించే జంతువులు జనావాసాల్లోకి వస్తున్నాయి.  రోడ్లు నిర్మానుష్యంగా మారడంతో వన్యమృగాలు, వన్యప్రాణులు రోడ్డు మీదకు వస్తున్నాయి. ఇటీవలే హైదరాబాద్ మహానగరంలో చిరుత హల్చల్ చేసింది.  ముంబై, నోయిడా, కేరళలోని అనేక ప్రాంతాల్లో వన్యప్రాణులు రోడ్డు మీదకు వచ్చిన దృశ్యాలను చూస్తూనే ఉన్నాయి.  

అయితే, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగాని ఓ తాబేలు మెల్లిగా అడవిని దాటి వచ్చింది.  తాబేలు ఎంత నిదానంగా నడుస్తుందో చెప్పక్కర్లేదు.  చిన్నప్పుడు కుందేలు తాబేలు కథ తెలిసిందే.  కుందేలును ఓడించి తాబేలు గెలవడం చూసాం.  ఓపికగా నడుచుకుంటూ వచ్చిన తాబేలు, ఓ ఇంటి డోర్ వద్దకు వచ్చింది.  డోర్ క్లోజ్ చేసి ఉన్నది.  అయితే, ఆ తాబేలు గ్లాస్ డోర్ ను మెల్లిగా పక్కకు జరిపి లోపలికి వచ్చింది.  డోర్ ను అలా తెరవాలని దానికి ఎలా తెలుసో ఏమో... దీనిని ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత్ నంద తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.