యాత్ర ఇలా ప్రారంభమౌతుందట..!!

యాత్ర ఇలా ప్రారంభమౌతుందట..!!

యాత్ర.. వైఎస్  రాజశేఖర్ రెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా.  సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.  సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటం విశేషం. ఈ సినిమా గురించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  సినిమా నిడివి 2 గంటలకంటే తక్కువ.  ఈ కొద్దిసమయంలో దర్శకుడు మహి సినిమాను ఎలా చూపించాడు.. సినిమాలో ఏయే అంశాలను టచ్ చేసి ఉంటాడు అనే దాని గురించే ఇప్పుడు చర్చ జరుగుతున్నది.  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  అది సినిమా ఓపెనింగ్ సీన్ గురించే.  

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే నేను అనే డైలాగ్ తో సినిమా ఓపెన్ అవుతుంది.   ప్రమాణ స్వీకారం పూర్తికాగానే వైఎస్ నిద్ర నుంచి లేస్తాడు.  ప్రమాణ స్వీకారం చేయడం అనే సీన్ వైఎస్ కలలా చూపిస్తారు. అక్కడి నుంచి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర ప్రారంభించడం..కలను సాకారం చేసుకోవడం వంటి అంశాలను సినిమాలో చూపించబోతున్నారు.  అంతేకాదు, మమ్మూట్టి ప్రతి ఫ్రేమ్ లో ఒదిగిపోయి నటించడానికి.. సినిమాను మమ్మూట్టి తన భుజాలపై వేసుకొని నడిపించడానికి తెలుస్తోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకు ఆగాల్సిందే.