జగన్‌కు క్లాస్‌మేట్స్‌ సర్‌ప్రైజ్‌..!

జగన్‌కు క్లాస్‌మేట్స్‌ సర్‌ప్రైజ్‌..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌కు ఆయన క్లాస్‌మేట్స్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తెలంగాణ సీఎంతో భేటీకి హైదరాబాద్ వచ్చిన జగన్‌కు స్పెషల్‌ ఫ్లెక్సీలతో వెల్కమ్ చెప్పారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జగన్‌ చదువుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్ స్నేహితులు బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఏరియాలో మెట్రో పిల్లర్స్ వద్ద డిజిటల్ బోర్డులలో శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. 1991 నాటి ఫొటోల‌తో బ్యాన‌ర్లు, ఫ్లెక్సీల‌ను కూడా రూపొందించారు. 'ప్రౌడ్ ఆఫ్ యు జ‌గ‌న్‌' అంటూ డిజిటల్‌ బోర్డులను ఏర్పాటు చేయించారు.