హృతిక్ ముందుగానే వస్తున్నాడు

హృతిక్ ముందుగానే వస్తున్నాడు

హృతిక్ రోషన్ ఒకప్పుడు అనేక సక్సెస్ సినిమాలు చేశారు.  గత కొంతకాలంగా సక్సెస్ రేట్ లో వెనకబడ్డాడు.  అంతేకాదు, బాలీవుడ్ క్వీన్ కంగనాకు హృతిక్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది.  ఈ పర్సనల్ వివాదాన్ని కెరీర్లోకి తీసుకొచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లిపోయారు.  హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్న సూపర్ 30 సినిమాపై ఇప్పుడు ఎఫెక్ట్ పడింది.  

మొదట సినిమాను జనవరి 26 వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు.  అదే రోజున కంగనా మణికర్ణికా సినిమా రిలీజ్ ఉండటంతో సినిమా వాయిదా పడింది.  పైగా దర్శకుడు వికాస్ బల్ మీటు కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.  దీంతో దర్శకుడు లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయాల్సి వచ్చింది.  తరువాత ఈ సినిమాను జులై 26 న రిలీజ్ చేద్దామని అనుకుంటే అదే రోజున కంగనా తన మెంటల్ హై క్యా సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యింది.  దీంతో సినిమాను సెప్టెంబర్ కు మార్చాలని అనుకున్నారు.  ఇప్పటికే ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో కంగనా సినిమా కంటే రెండు వారాల ముందుగానే అంటే జులై 12 వ తేదీన సినిమాను రిలీజ్ చేయడానికి యూనిట్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది.  జులై 12 వ తేదీని ఫిక్స్ చేశారని... ఇక తేదీని మార్చబోరని సమాచారం.