మాస్టర్ హిందీ రీమెక్‌లో యాక్షన్ హీరో..?

మాస్టర్ హిందీ రీమెక్‌లో యాక్షన్ హీరో..?

తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన సినిమా మాస్టర్. అభిమానులకు కన్నుల విందు చేసిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ ప్రయాణం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారట. అంతేకాకుండా ఈ హిందీ రీమేక్‌లో విజయ్ పాత్రలో బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ హిందీ రీమేక్‌ను సినీ1 స్టూడియోస్, ఎండెమోల్, నిర్మాత లలిత్‌లు సంయుక్తంగా నిర్మించనున్నారట. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్‌లో కూడా విజయ్ సేతుపతి కొనసాగనున్నాడట. మాస్టర్ హిందీ రేమేక్‌లో విజయ్ సేతుపతి, హృతిక్‌తో తలపడేందుకు సన్నద్దంగా ఉన్నాడు. అయితే ఈ మేరకు ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ప్రకటన అతి త్వరలో అభిమానుల ముందుకు వస్తుందని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం హృతిక్ రోషన్ తన నూతన చిత్రం ఫైటర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో హృతిక్ సరసన దీపికా పదుకొణె నటించనుంది. మరి మాస్టర్ రీమేక్ ఎప్పుడు మొదలుకానుంది అనేది తెలియాల్సి ఉంది.