హువేయి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

హువేయి స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'హువేయి' తన వినియోగదారులకు క్రిస్మస్ పండగ సందర్భంగా ఆఫర్ల వర్షం కురిపించింది. 'హువేయి హాలిడే సేల్'లో భాగంగా ఎంపిక చేసుకున్న  హువేయి ఫోన్లపై రూ. 10 వేల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. అమెజాన్ ఇండియా స్టోర్ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. హువేయి నోవా 3, హువేయి నోవా 3ఐ, హువేయి పీ20 ప్రో, హువేయి  పీ20 లైట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.

రూ. 19,999 ఉన్న 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 'హువేయి పీ20 లైట్' ఫోన్ రూ. 14,999లకు లభిస్తుంది. రూ. 20,990 ఉన్న 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 'హువేయి నోవా 3ఐ' ఫోన్ రూ. 16,990లకు అందుబాటులో ఉంది. అలానే 'హువేయి వోవా 3' ఫోన్ రూ. 29,999లకు.. హువేయి పీ20 ప్రో రూ. 54,999లకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లు కొనుగోలు చేసిన కస్టమర్లకు ఈఎంఐ ఛార్జీలు వర్తించవు. ఫోన్లను ఎక్స్ఛైంజ్ కూడా చేసుకోవచ్చు.