హువావీ నుంచి 4 కొత్త ఫోన్లు

హువావీ నుంచి 4 కొత్త ఫోన్లు

స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేకమైన హువావీ నుంచి నాలుగు కొత్త ఫోన్లు మరికాసేపట్లో లాంచ్ అవుతున్నాయి. హువావీ మేట్ 20 సిరీస్ లో ఒకేసారి 4 ఫోన్లను విడుదల చేస్తారని, వాటిలోని ఫీచర్స్, పనితీరు ఎలా ఉంటుందో చూడాలని స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎదురు చూస్తున్నారు. మేట్ 20 సిరీస్ లో అన్నిటికన్నా ముఖ్యంగా ప్రత్యేకమైన ఎల్ షేపులో 3 రియర్ కెమెరా ఉంటుందని, అందులో 3 లెన్సెస్ ఉంటాయన్న లీకులు వెలువడ్డాయి. 

హువావీ మేట్ 20 ప్రో లో 6.9 అంగుళాల క్వాడ్ హెచ్.డి. ప్లస్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, 
19.5:9 యాస్పెక్ట్ స్క్రీన్ రేషియో, కంపెనీ ఓన్డ్ కిరిన్ 980 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా ఈ సిరీస్ ఫోన్లు ఔట్ రైట్ పర్ఫామెన్స్ కనబరుస్తాయంటున్నారు. జీపీయూ టర్బో 2.0 టెక్నాలజీకి పూర్తిగా సహకరిస్తుందని భావిస్తున్నారు. 

ఈ సిరీస్ ఫోన్లు... 6 జీబీ/8 జీబీ ర్యామ్ వేరియెంట్స్ లో లభిస్తాయి. అలాగే మేట్ 20 ప్రో కు 4200ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుందంటున్నారు. చాలా వేగంగా చార్జయ్యే సూపర్ చార్జ్ 2.0 టెక్నాలజీ కస్టమర్లకు మరింత సౌకర్యంగా ఉంటుందని ఆశిస్తున్నారు.