భార‌త్‌లో విడుద‌ల కానున్న 'హువావే' మేట్ ఎక్స్

భార‌త్‌లో విడుద‌ల కానున్న 'హువావే' మేట్ ఎక్స్

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ త‌యారీదారు 'హువావే' మేట్ ఎక్స్ ఫోల్డ‌బుల్ స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. కంపెనీ ఈ మ‌డ‌త‌బెట్టే ఫోన్‌ను బార్సిలోనాలో విడుద‌ల చేసింది. అయితే ఈ ఫోన్‌ను త్వ‌ర‌లో భార‌త మార్కెట్‌లో కూడా విడుద‌ల చేయ‌నున్నారు. భార‌త్‌లో విడుద‌ల అవనున్న తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ఫోన్ ధ‌ర రూ.1,85,220 లుగా ఉంది. హువావే మేట్ ఎక్స్ ఫోల్డ‌బుల్ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.

ఫీచర్లు:

# 6.6 ఇంచుల డిస్‌ప్లే (6.38 ఇంచుల సెకండ‌రీ డిస్‌ప్లే)
# కైరిన్ 980 ప్రాసెస‌ర్‌
# ఆండ్రాయిడ్ 9.0 పై
# 40, 16, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
# 4,500 ఎంఏహెచ్ బ్యాట‌రీ
# ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌