హువాయి 4 కెమెరాల ఫోన్లు

హువాయి 4 కెమెరాల ఫోన్లు

చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ హువాయి ఇవాళ రెండు కొత్త హ్యాండ్ సెట్లను విడుదల చేసింది. నోవా 3 సిరీస్ లో నోవా 3, నోవా 3ఐ పేరుతో రెండు స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 6 జీబీల వరకు రామ్, ముందు, వెనుక డ్యుయల్ కెమెరా సెటప్ ఈ రెండు స్మార్ట్ ఫోన్లకున్న ప్రధాన ఆకర్షణలు. నాలుగు ఆర్టిఫిషియల్‌ క్వాడ్‌ కెమెరాలు, సొంతంగా తయారుచేసిన 3డీ క్యు(ఎ)మోజీల సృష్టి తమ మొబైళ్ల ప్రత్యేకత అని ఢిల్లీలో లాంచింగ్‌ సందర్భంగా కంపెనీ ప్రకటించింది. ఈ రెండు ఫోన్ల అమ్మకాలు తమ ప్రత్యేక ఆన్ లైన్ రీటైల్ భాగస్వామి ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్‌ ద్వారా జరపనున్నట్టు హువావీ ప్రతినిధులు తెలిపారు.

హానర్‌ నోవా 3 ఫీచర్లు


డ్యుయల్ సిమ్ (నానో) 
డ్యుయల్ వోల్టె
6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1080x2340  పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్
ఫింగర్ ప్రింట్ సెన్సర్
ఫేస్ అన్ లాక్ ఫీచర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్లాట్ ఫామ్
6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా  
3750 ఎంఏహెచ్‌ హైసిలికాన్ బ్యాటరీ
ధర: రూ.34,999

నోవా 3ఐ ఫీచర్లు

డ్యుయల్ సిమ్ (నానో)
డ్యుయల్ వోల్టె
6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ప్లాట్ ఫామ్
4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ 
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
16+2 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా
24+2 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా    
3340 ఎంఏహెచ్‌ హైసిలికాన్ బ్యాటరీ
ధర: రూ.20,990

నోవా3, నోవా3ఐ ప్రీ ఆర్డర్లు ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. హానర్‌ 3 ఆగస్టు 23 నుంచి, హానర్‌ 3ఐ ఆగస్టు 7 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. రూ. 2,000 ఎక్స్జేంజ్‌,  రూ. 1000 క్యాష్‌బ్యాక్‌తోపాటు జియో యూజర్లకు ఉచిత డేటా లాంటి లాంచింగ్‌ ఆఫర్లను కూడా కంపెనీ అందిస్తోంది.