ఈ ఫోన్ కెమెరాని చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్!!

ఈ ఫోన్ కెమెరాని చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్!!

చైనా టెక్నాలజీ దిగ్గజం హువావీని ఎలాగైనా దారికి తెచ్చుకొనేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన హువావీ ఉత్పత్తులు, టెక్నాలజీపై ఆంక్షలు విధించి చైనా కొమ్ములు వంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పుడు చూడబోయే వీడియోలో హువావీ ఫోన్ కెమెరా క్లారిటీ చూస్తే మాత్రం అమెరికా భయంతో వణికిపోవడం సరేనని అనిపించక మానదు. ఓ పెద్ద బహుళ అంతస్థుల భవనం కిటికీలో నుంచి కనీసం 15వ అంతస్థులో నుంచి ఈ వీడియో తీసినట్టు భావించవచ్చు. ఇందులో అంత ఎత్తు నుంచి మరో భవనం దాటిన తర్వాత కొంత దూరాన ఇద్దరు పిల్లలు ఆడుతున్నారు. మామూలుగా చూస్తే కంటికి కనిపిచరు. ఈ కెమెరాతో వాళ్లు కనిపించడమే కాదు వాళ్లు ఆడుతున్న కాయిన్స్ కూడా స్పష్టంగా ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. అది కూడా చక్కని స్పష్టతతో. హువావీ కొత్త ఫోన్ కెమెరా ఇంత స్పష్టమైన ఆప్టికల్ జూమ్ తో అమెరికా కంపెనీల స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే చౌకగా లభిస్తే తమ వ్యాపారానికి దెబ్బని అమెరికా భయపడటంలో తప్పే లేదనిపిస్తుంది కదా!!