మిషన్ భగీరథకు మరో ప్రతిష్టాత్మక అవార్డు..

మిషన్ భగీరథకు మరో ప్రతిష్టాత్మక అవార్డు..

మిషన్ భగీరథను మరోసారి ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని గృహనిర్మాణ, నగరాభివృద్ధి సంస్థ (హడ్కో) అవార్డు దక్కింది. మౌలిక వసతుల కల్పనలో వినూత్న విధానాలను అమలు చేస్తున్న రాష్ట్రాలకు హడ్కో ఏటా అవార్డులను ప్రకటిస్తోంది. వసతుల కల్పన-వినూత్న విధానాలు విభాగంలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు మిషన్ భగీరథకు ఈ ఏడాది అవార్డు లభించింది. మిషన్ భగీరథకు గతంలో కూడా వేర్వేరు విభాగాల్లో రెండు అవార్డులు వచ్చాయి. ఈ ఏటి అవార్డు మూడో అవార్డు. ఢిల్లీలో నిర్వహించిన హడ్కో 49వ వ్యవస్థాపక దినోత్సవంలో మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) కృపాకర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.