ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ కోసం భారీ ఏర్పాట్లు !

ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ కోసం భారీ ఏర్పాట్లు !

 

భారీ సినిమా వేడుకలంటే సాధారణంగా ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదా సక్సెస్ మీట్ అనుకుంటాం.  కానీ రాజమౌళి అండ్ టీమ్ మాత్రం ప్రెస్ మీట్ ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది.  'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబందించి నిర్మాణ సంస్థ మొదటిసారి నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ కావడంతో ఇంత హంగామా చేస్తున్నారు.  ఈ ప్రెస్ మీట్లో రాజమౌళితో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్, నిర్మాత దానయ్య, ఇతర ముఖ్యులు పాల్గొననున్నారు.  రేపు ఉదయం 11:30 గంటల నుండి ప్రెస్ మీట్ మొదలుకానుంది.