అజిత్ తో బోనీ కపూర్ భారీ సినిమా

అజిత్ తో బోనీ కపూర్ భారీ సినిమా

అజిత్ ఎలాంటి నటుడో చెప్పక్కర్లేదు.  అయన సినిమాలు అద్భుతంగా ఉంటాయి. రీసెంట్ గా వచ్చిన విశ్వాసం సినిమా సూపర్ హిట్టైంది.  ఇప్పుడు ఈ హీరో బోనీ కపూర్ తో పింక్ సినిమా రీమేక్ నెర్కొండ పారవై చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.  దీంతో పాటు బోనీ కపూర్ అజిత్ తో ఓ అంతర్జాతీయ సినిమాను తీసేందుకు రెడీ అయ్యారు.  

బైక్ రేస్ కు సంబంధించిన సినిమా.  భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నారు.  ఈ మూవీని ఇండియాతో పాటు దక్షిణాఫ్రికా, మిడిల్ ఈస్ట్, బుడాపెస్ట్ వంటి చోట్ల రిలీజ్ చేస్తారట.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నది.  

యూనివర్శల్ అప్పీల్ ఉన్న టైటిల్ కోసం టీమ్ వెతుకుతున్నారట. ఇక అజిత్ స్వతహాగానే బైక్ రేసర్. పలు మోటార్ సైకిల్ ఛాంపియన్ షిప్స్ లోనూ అతడు పాల్గొన్న అనుభవం ఉంది. అందువల్ల అతడి సూచనలు రీమేక్ స్క్రిప్టుకు పెద్ద సాయమయ్యాయని నిర్మాత బోనీకపూర్ చెబుతున్నారు.