ఏలూరులో భారీగా రోడ్డుమీదకు జనం... ఎందుకంటే... 

ఏలూరులో భారీగా రోడ్డుమీదకు జనం... ఎందుకంటే... 

ఆదివారం వస్తే ప్రజలు రోడ్డుమీదకు ఎక్కువగా వస్తుంటారు.  ఉదయం సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది.  ఆదివారం రోజున నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువగా రోడ్డుమీదకు వచ్చి కావాల్సిన నం వెజ్ ఐటమ్స్ ను కొనుగోలు చేసుకొని వెళ్తుంటారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే లాక్ డౌన్ సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో జనాలు రోడ్డు మీదకు వస్తున్నారు. 

ఈరోజు ఫిష్ మార్కెట్ కు సెలవు ప్రకటించినప్పటికీ కూడా జనాలు నాన్ వెజ్ కోసం మార్కెట్ వద్ద బారులు తీరడం విశేషం.  కూరగాయలు, నిత్యవసర వస్తువుల కోసం పెద్ద ఎత్తున మెయిన్ బజార్ లోకి ప్రజలు రావడంతో పోలీసులకు కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతున్నది.  సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా జనాలు రోడ్డు మీదకు వస్తున్నారు.