ఒక్క సినిమాతోనే భారీక్రేజ్..!!

ఒక్క సినిమాతోనే భారీక్రేజ్..!!

ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు కియారా అద్వానీ.  మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.  అందులో ఉన్నది చిన్న పాత్రే అయినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నది.  అటు బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ ద్వారా పాపులర్ కావడంతో.. టాలీవుడ్ లోను డిమాండ్ పెరిగింది.  

ప్రస్తుతం రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేస్తున్నది.  ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరిన్ని ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం.  అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో కూడా ఎంపికైనట్టుగా సమాచారం అందుతున్నది.  ఇంతవరకు ఈ సినిమా ఫైనల్ కాలేదు.  దీనికి సంబంధించిన ఎటువంటి అధికారికమైన న్యూస్ బయటకు రాలేదు.  అప్పుడే హీరోయిన్ గురించి వార్తలు బయటకు వస్తున్నాయి.  దీనితో పాటు మహేష్ - సుకుమార్ సినిమాలో కూడా కియారా నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా కోసం కొరటాల శివ కియారా అద్వానీ పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నది.  తెలుగులో ఇప్పటివరకు చేసింది ఒక్క సినిమానే.  కానీ ఇన్ని సినిమాల్లో ఆఫర్లు వస్తున్నట్టు పుకార్లు వినిపించడంతో ఆంతా షాక్అవుతున్నారు.