నాగ చైతన్య క్రేజ్ తగ్గలేదు !

 నాగ చైతన్య క్రేజ్ తగ్గలేదు !

అక్కినేని హీరో నాగ చైతన్య గత సినిమాలు మూడు బాక్సాఫీస్ ముందు పెద్దగా సక్సెస్ కాకపోయినా ఆయన క్రేజ్ మాత్రం తగ్గలేదు.  ఆయన చేస్తున్న కొత్త సినిమాలకు ట్రేడ్ వర్గాల్లో మంచి డిమాండ్ కనిపిస్తోంది.  అందులోనూ సమంతతో కలిసి చేస్తున్న 'మజిలీ' సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.  లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మేరకు ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ 6 కోట్ల పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిందని తెలుస్తోంది.  శివ నిర్వాణ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.