సీనియర్ హీరో సినిమాకు భారీ డిమాండ్

సీనియర్ హీరో సినిమాకు భారీ డిమాండ్

టాలీవుడ్ లో చాలామంది సీనియర్ హీరోలు ఉన్నారు.  అందరు సినిమాలు చేస్తున్నా కొందరు మాత్రమే హిట్ కొడుతున్నారు.  ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మెన్ గా పేరుతెచ్చుకున్న రాజశేఖర్ గరుడవేగ సినిమాతో మరలా హిట్ కొట్టాడు.  ఈ సినిమా తరువాత ఈ హీరో కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  

అ వంటి వినూత్నమైన సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  రీసెంట్ గా రిలీజైన టీజర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో అంచనాలు పెరిగాయి.  ఈ అంచనాలకు తగ్గట్టుగానే... థియేట్రికల్ రైట్స్ కూడా ఉన్నాయి.  సత్యసాయి ఆర్ట్స్ అధినేత కెకె రాధామోహన్ ఈ సినిమాను ఫ్యాన్సీ రేట్ ఇచ్చి తీసుకున్నారట.  థియేట్రికల్ రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది.  మూడు ప్రముఖ చానళ్ళు ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నం చేస్తున్నాయట.