సౌత్ ఇండస్ట్రీకి బాలీవుడ్ ఫిదా..!!

సౌత్ ఇండస్ట్రీకి బాలీవుడ్ ఫిదా..!!

కప్పుడు సౌత్ లో నిర్మించే సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ కావాలంటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చేది.  బాలీవుడ్ నుంచి మాత్రం సౌత్ కు సినిమాలు ఈజీగా వచ్చేవి.  బాలీవుడ్ నుంచి హీరోయిన్లు సౌత్ కు వచ్చేవారు.  ఇప్పటికి ఆ సంస్కృతీ కొనసాగుతూనే ఉంది.  గత కొంతకాలం నుంచి ఈ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.  సౌత్ లో హిట్టైన సినిమాలు అక్కడ డబ్ అయ్యేవి.  ఇక్కడి సినిమాలను సౌత్ తో పాటు బాలీవుడ్ లోను ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.  ముఖ్యంగా సౌత్ లో సూపర్ పాపులర్ హీరో రజినీకాంత్ సినిమాలు బాలీవుడ్ లో ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి.  రజినీకాంత్ తరువాత కమల్ హాసన్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.  ఇప్పుడు తెలుగు సినిమాలు కూడా అక్కడ ఒకే టైమ్ లో రిలీజ్ అవుతుండటం విశేషం.  

బాహుబలి సినిమాకు ముందు సౌత్ స్టార్స్ అప్పుడప్పుడు హిందీ సినిమాలు చేసేవారు.  రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి సీనియర్ హీరోలు గతంలో బాలీవుడ్ చిత్రాల్లో నటించారు.  ఇప్పుడు ఆ సంఖ్య తక్కువగా ఉంది.  ధనుష్, సిద్దార్ధ బాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.  కాగా, ఇప్పుడు దగ్గుబాటి రానా బాలీవుడ్ లో వరస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు.  ఏ జవానీ హై దివాని, దమ్ మారో దమ్, బేబీ, ఘాజి, బాహుబలి, వెల్కమ్ టు న్యూయార్క్, ఇప్పుడు హాతి మేరీ సాతి సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ లో బిజీ అయ్యారు.  

మరోవైపు బాహుబలి తరువాత ప్రభాస్ సినిమాలు కూడా బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి పెద్దపెద్ద సంస్థలు ముందుకు వస్తున్నాయి.  ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాకు కూడా బాలీవుడ్ భారీ డిమాండ్ ఉన్నది.  15 సంవత్సరాల తరువాత ఇప్పుడు నాగార్జున.. అమితాబ్ బచ్చన్, రన్బీర్ కపూర్, అలియా భట్ లతో కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్నాడు.  ఇందులో నాగార్జున ఓ లీడ్ రోల్ చేస్తున్నారు.  సో, ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ అనే భేదం లేకుండా మంచి అవకాశాలు ఎక్కడ వస్తే అక్కడికి మన యాక్టర్లు వాలిపోతున్నారు.  ఇది మంచి పరిణామమే.