రంగస్థలాన్ని మించే విధంగా..!!

రంగస్థలాన్ని మించే విధంగా..!!

చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మగధీర సినిమాతో మెప్పించాడు.  ఆ తరువాత కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ చెప్పుకోదగ్గ స్థాయిలో పెర్ఫార్మన్స్ ఇవ్వలేకపోయాడు.  సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలోని తన నటనతో విమర్శకులను సైతం మెప్పించాడు.  

ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో వినయ విధేయ రాముడిగా వస్తున్నాడు.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ఇప్పటికే రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాకు భారీ హైప్ వచ్చింది.  పైగా ఈ సినిమాను హై యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కించారు.  మరి ఈ సినిమా అంచనాలను అందుకునే విధంగా ఉంటుందా లేదా అన్నది జనవరి 11 తో తేలిపోతుంది.