బ్లూచిప్‌ల దొంగదెబ్బ

బ్లూచిప్‌ల దొంగదెబ్బ

ఇవాళ మార్కెట్‌ నిలకడగా ముగిసినట్లు కన్పించినా.. ప్రధాన షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. దాదాపు కీలక సూచీలు భారీగా నష్టపోయాయి. మెటల్‌ షేర్లు మూడున్నర శాతం క్షీణించగా, ప్రభుత్వ బ్యాంకులు, రియాల్టి షేర్ల సూచీలు రెండు శాతానికి పైగా నష్టపోయాయి.

ఆటో, ఐటీ, ఫార్మా షేర్లు కూడా ఒక శాతం వరకు క్షీణించాయి. సూచీలు మాత్రం నిలకడగా ముగిశాయి. నిఫ్టి స్వల్ప నష్టంతో  10,718 వద్ద క్లోజ్‌ కాగా, సెన్సెక్స్ 35176 వద్ద స్వల్ప లాభంతో ముగిసింది. నిఫ్టి షేర్లలో కొటక్‌ బ్యాంక్‌ నాలుగు శాతం లాభ పడగా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 2 శాతం లాభపడింది. ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్‌ షేర్లు ఒకశాతంపైగా లాభపడ్డాయి. ఇక నష్టాలతో ముగిసిన షేర్లలో వేదాంత 5 శాతంపైగా నష్టపోయింది. హెచ్‌సీఎల్‌ టెక్‌ 4.5 శాతం క్షీణించగా హిందాల్లో మూడున్నర శాతం పడిపోయింది. టాటా స్టీల్‌ కూడా 3 శాతంపైగా నష్టపోయింది.