షాకిస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్

షాకిస్తున్న ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్

ఆర్ఆర్ఆర్ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున జరుగుతున్నది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఈ షూట్ లో పాల్గొంటున్నారు.  ఈ ఇద్దరికి సంబంధించిన కీలక సీన్స్ ను షూట్ చేస్తున్నారు.  హీరోలు తప్పించి మిగతా నటీనటుల విషయాలను రాజమౌళి ఇప్పటి వరకు ప్రకటించలేదు.  త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలను ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి.  

ఈ విషయాన్ని పక్కన పెడితే... ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  ఓవర్సీస్ రైట్స్ ను ఓ సంస్థ దాదాపు రూ.75 కోట్ల రూపాయలకు దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.  రామ్ చరణ్, ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది హయ్యస్ట్ ఓవర్సీస్ బిజినెస్ అవుతుంది.  ఈ సినిమా తెలుగుతో పాటు దక్షిణాది భాషలు, బాలీవుడ్ లోను రిలీజ్ కాబోతున్నది.  అటు చైనా, జపాన్ లో కూడా ఆర్ఆర్ఆర్ ను భారీ ఎత్తున రిలీజ్ చేస్తారట.   ఒక్క ఓవర్సీస్ రైట్స్ రూ.75 కోట్ల రూపాయలకు అమ్ముడుపొతే... ఇండియాలో రైట్స్ ఇంతకు అమ్ముడుపోయి ఉండాలి.