భారీ ధరకు చరణ్ సినిమా హక్కులు !

భారీ ధరకు చరణ్ సినిమా హక్కులు !

రామ్ చరణ్, బోయపాటి శ్రీనుల కలయికలో వస్తున్న చిత్రంపై తార స్థాయి అంచనాలున్న సంగతి తెలిసిందే.  భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ హిట్టైతే వసూళ్లు కళ్ళు చెదిరేలా ఉండి, చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు భారీ లాభాలని ఆర్జించే అవకాశాలున్నాయి. 

అందుకే డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో సినిమా హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది.  ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఈ చిత్రం యొక్క గుంటూరు జిల్లా హక్కుల్ని పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలుచేసినట్టు తెలుస్తోంది.  డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నారు.