హైదరాబాద్ లో భారీ వర్షం.. డిజాస్టర్ టీమ్స్ ని అలెర్ట్ చేసిన జిహెచ్ఎంసి !

హైదరాబాద్ లో భారీ వర్షం.. డిజాస్టర్ టీమ్స్ ని అలెర్ట్ చేసిన జిహెచ్ఎంసి !

హైదరాబాద్ సిటీలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతున్నది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో జల్లులు కురుస్తున్నాయి. ఎల్బీనగర్,  ఉప్పల్, హయత్ నగర్, నాగోల్, వనస్థలిపురంలో భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లోనూ ఓ మాదిరిగా వర్షం కురుస్తోంది. ఇక కోఠి, బేగంబజార్, బషీర్ బాగ్, నాంపల్లి, చాదర్ ఘాట్ లో కూడా భారీగానే వర్షం కురుస్తోంది.

అత్యధికంగా కుషాయిగూడలో 5 సెంమీ, ఉప్పల్ లో 4 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. అయితే ఈ భారీ వర్షాల దెబ్బకి జిహెచ్ఎంసి మాన్సూన్, డిజాస్టర్ టీమ్స్ ని అప్రమత్తం చేసింది. ఈ కురుస్తున్న వర్షాలతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన 3 రోజుల నుంచి 384 ఫిర్యాదులని జిహెచ్ఎంసి స్వీకరించినట్టు సమాచారం. జిహెచ్ఎంసి కాల్ సెంటర్ కు 129, డయల్  100కు 67 అలానే మై జిహెచ్ఎంసి యాప్ కు 165,  జిహెచ్ఎంసి వెబ్ సైట్ ద్వారా 23 ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.