చెరువులను కాపాడాలంటూ.. మహా ర్యాలీ...

చెరువులను కాపాడాలంటూ.. మహా ర్యాలీ...

మూసి కన్నా ఘోరంగా తయారైన చెరువులను శుభ్రం చేసి డ్రైనేజి పైప్ లైన్ కి ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా ప్రజలు. అందుకోసం కాలుష్యం నుండి చెరువులను రోగాల భారీ నుండి తమను రక్షించాలని కోరుతూ జనం ఆందోళన బాట పట్టారు. రాజకీయాలకు అతీతంగా వంద కాలనీ వాసులు ఆందోళనకు నడుంబిగించారు. కొంతకాలంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా ఈరోజు 72 కాలనీలకు చెందిన 5వేల మందితో మహా ర్యాలీ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్పేట్ అల్మాస్ గూడా కమాన్ నుండి మంద మల్లమ్మ ఫంక్షన్ హాల్ వరకు ఈ ర్యాలీ సాగుతుంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.