నాగ్, నానిలకు ఇదే పెద్దది !

నాగ్, నానిలకు ఇదే పెద్దది !

నాగార్జున, నానిలు కలిసి నటించిన 'దేవదాస్' సినిమా రేపు రిలీజ్ కానుంది . ఈరోజు రాత్రి నుండే అమెరికాలో ప్రీమియర్ల ద్వారా ప్రదర్శితంకానుంది ఈ చిత్రం.  సుమారు 180 లొకేషన్లలో ఈ ప్రీమియర్లు వేయనున్నారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. 

ఇప్పటి వరకు విడుదలైన నాని, నాగార్జునల సినిమాలు ఈ స్థాయిలో ప్రీమియర్ల ద్వారా ప్రదర్శితం కాలేదు.  ఈ భారీ విడుదలతో మొదటి రోజు వసూళ్లు భారీగా ఉండే అవకాశాలున్నాయి.  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించారు.