త్రివిక్రమ్ కు డిమాండ్ మామూలుగా లేదుగా!?

త్రివిక్రమ్ కు డిమాండ్ మామూలుగా లేదుగా!?

స్టార్ హీరోలకు, హీరోయిన్లకు అదర్ ఇన్ కమ్ బాగానే ఉంటుంది. వాళ్ళకున్న క్రేజ్ ను బట్టి బ్రాండ్స్ కు ప్రచారకర్తలుగా పని చేసి లక్షలు, కోట్లు సంపాదిస్తుంటారు. అయితే... ఆ ప్రచార చిత్రాలను షూట్ చేసే దర్శకులకూ మంచి రెమ్యూనరేషనే ఉంటుంది. అయితే... బాలీవుడ్ యాడ్ డైరెక్టర్స్ ను మించిన పారితోషికాన్ని మన తెలుగు దర్శకుడు త్రివిక్రమ్ పొందుతుండటం విశేషం. ఇటీవల మహేశ్ బాబు రెండు యాడ్ ఫిల్మ్స్ లో నటించాడు. అందులో ఒకదాన్ని 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగ డైరెక్ట్ చేయగా, మరో దాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేశారట. సహజంగా ముంబైకి చెందిన స్టార్ డైరెక్టర్స్ ఒకటి రెండు రోజుల్లో షూట్ చేసే యాడ్స్ కోసం 10 నుండి 12 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. కానీ త్రివిక్రమ్ కు ఏకంగా రూ. 30 లక్షల రూపాయలను ఒక్క రోజు డైరెక్ట్ చేసినందుకే సదరు కంపెనీ ఇచ్చిందని తెలుస్తోంది. స్టార్ హీరోలతో చేసే ఫీచర్ ఫిల్మ్ కు కోట్లు తీసుకుంటున్న త్రివిక్రమ్... ఇప్పుడు యాడ్ ఫిల్మ్ మేకర్ గానూ అదే స్థాయిలో రెమ్యూనరేషన్ పొందుతుండటం గ్రేట్!