భీమవరంలో భారీ కుంభకోణం.. రంగంలోకి సిబిఐ బృందం..!!

భీమవరంలో భారీ కుంభకోణం.. రంగంలోకి సిబిఐ బృందం..!!

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీ కుంభకోణం బయటపడింది. దాదాపు రూ. 370 కోట్ల రూపాయల మేర ఋణం పొంది వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు బ్యాంకు అధికారుల దృష్టికి రావడంతో.. బ్యాంకు అధికారులు సిబిఐను ఆశ్రయించింది.  దీంతో సిబిఐ రంగంలోకి దర్యాప్తును ప్రారంభించినట్టు తెలుస్తోంది.  ఈ కుంభకోణం వ్యవహారంలో బీమవరానికి చెందిన పలువురు రాజకీయ వ్యాపార ప్రముఖులు ఉన్నట్టు తెలుస్తోంది.  

బ్యాంకు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల వద్దనుంచి రుణాలు పొందిన వారి రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇందులో చాలామంది నకిలీ పత్రాలను సమర్పించి రుణాలు పొంది బ్యాంకులను మోసం చేస్తున్నట్టు తెలుస్తోంది.