ఏడెక‌రాల్లో `సైరా` భారీ సెట్‌

ఏడెక‌రాల్లో `సైరా` భారీ సెట్‌

మెగాస్టార్ చిరంజీవి వీరాధివీరుడిగా న‌టిస్తున్న‌ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `సైరా- న‌ర‌సింహారెడ్డి`. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ‌ న‌ర‌సింహారెడ్డి జీవిత‌క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు 300కోట్ల బ‌డ్జెట్‌తో ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో త‌ల‌మానికం అన‌ద‌గ్గ రీతిలో నిర్మించేందుకు రామ్‌చ‌ర‌ణ్ తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దాదాపు ఆరు నెల‌ల క్రితం మొద‌లైన ఈ సినిమాని ఎంతో జాగ్ర‌త్త‌గా ఆచితూచి తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికి 25శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ఈ చిత్రంలో 30శాతం భారీ వార్ ఎపిసోడ్స్ రోమాలు నిక్క‌బొడిచే స్థాయిలో ఉంటాయ‌ని తెలుస్తోంది. 

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ కోకాపేట‌లో ఏడెక‌రాలు లీజ్‌కి తీసుకుని అక్క‌డ 8కోట్ల ఖ‌ర్చుతో అతి భారీ సెట్ నిర్మిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ సెట్‌లో వార్ ఎపిసోడ్స్ చిత్రీక‌రిస్తార‌ట‌. అలానే ప్ర‌ధాన‌తారాగ‌ణం.. చిరంజీవి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, విజ‌య్‌సేతుప‌తిపై కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది. వారియ‌ర్ సినిమాల్లోనే బెస్ట్ అనిపించేలా తెర‌కెక్కించేందుకు ప్ర‌ముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ గ్రెగ్ పావెల్‌ని బ‌రిలోకి దించారు. హాలీవుడ్‌లో జేమ్స్ బాండ్ సినిమా స్కై ఫాల్‌, హ్యారీ పోట్ట‌ర్‌, ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ చిత్రాల‌కు ప‌ని చేసిన ది గ్రేట్ ఫైట్ కొరియోగ్రాఫ‌ర్ గ్రెగ్ పావెల్‌. అత‌డితో అసాధార‌ణం అనిపించే వార్ ఎపిసోడ్స్‌ని చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఆగ‌ష్టు 22న మెగాస్టార్ పుట్టిన‌రోజు వేళ సైరా టీమ్ నుంచి అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.