స్టార్ హీరో కోసం 2 లక్షల కిలోల బరువైన సెట్ !

స్టార్ హీరో కోసం 2 లక్షల కిలోల బరువైన సెట్ !

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అంటేనే ప్రత్యేకత.  ఆయన చేసే ప్రతి సినిమా దేనికదే భిన్నంగా ఉంటూ, ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది.  ప్రస్తుతం అయన చేస్తున్న సినిమా 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'.  19వ శతాబ్దంలో బ్రటిష్ వారి కాలంలోని దోపిడీదారులైన థగ్గుల కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 

అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్న ఈ సినిమాను యాష్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తోంది.  ఈ సినిమాలో సముద్రంపై ఓడల్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయట.  వాటి కోసం 1000 మంది సంవత్సరం పాటు కష్టించి రెండు భారీ కూడా సెట్స్ నిర్మించారట.  వీటి బరువే సుమారు 2లక్షల కిలోల వరకు ఉంటుందట.  ఈ చిత్రాన్ని 'ధూమ్ 3' ఫేమ్ విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేస్తున్నారు.