ప్రభాస్ కోసం భారీగా ప్లాన్ చేశారు...

ప్రభాస్ కోసం భారీగా ప్లాన్ చేశారు...

బాహుబలి తరువాత ప్రభాస్ సాహో, జాన్ సినిమాలు వరసగా చేస్తున్నారు.  సాహో షూటింగ్ పూర్తి చేసుకొని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.  ఆగష్టు 15 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.  దీంతో పాటు ప్రభాస్ జాన్ అనే టైటిల్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

1920 కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది.  యూరప్ లోని కొన్ని లొకేషన్స్ లో సినిమా కొన్ని రోజులు షూట్ చేశారు.  అయితే, అప్పటి రోజులకు అనుగుణంగా షూటింగ్ జరగాలి కాబట్టి దానికి తగ్గట్టుగా ఓ భారీ సెట్ ను నిర్మించబోతున్నారని తెలుస్తోంది.  దాదాపు రూ.30 కోట్ల రూపాయల భారీ వ్యయంతో యూరప్ లాంటి సెట్ నువేయబోతున్నారు.  150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది.  ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థలైన యూవీ క్రియేషన్స్ మరియు గోపికృష్ణ మూవీస్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.