పోలీస్ బాస్ సజ్జనార్ పై భారీ ఒత్తిడి... దేనికంటే... 

పోలీస్ బాస్ సజ్జనార్ పై భారీ ఒత్తిడి... దేనికంటే... 

దిశ కేసు ఎన్ కౌంటర్ తరువాత పోలీస్ బాస్ సజ్జనార్ ను ప్రజలు హీరోలు చేశారు.  ఆయనను పొగుడుతూ మెసేజ్ లు, ఫోన్లు చేసి అభినందిస్తున్నారు ప్రజలు.  ఇవన్నీ నాణానికి ఒకెత్తు.  మరోవైపు మరొకటి ఉన్నది.  ఎన్ కౌంటర్ జరగటానికి వారం ముందు నుంచి సజ్జనార్ మొబైల్ కు 2500 మిస్డ్ కాల్స్, మెసేజ్ లు, వాట్సాప్ సందేశాలు వచ్చాయట.  అవన్నీ ఏమంటే.. దిశ హత్యకేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు.. వేడుకోలు.. వేదనలు... ఆవేదనలతో కూడిన మెసేజ్ లు.  

ఒక్క సజ్జనార్ మొబైల్ కు మాత్రమే కాదు... సజ్జనార్ భార్య మొబైల్ ఫోన్ కు కూడా అదే విధంగా మెసేజ్ లు వచ్చాయట.  దీంతో సజ్జనార్ పై ఒత్తిడి పెరిగింది.  ఆ ఒత్తిడిని తట్టుకొని సజ్జనార్ కేసును చట్టప్రకారమే డీల్ చేయాలని అనుకున్నారు.  చట్టప్రకారమే నిందితులను పట్టుకోవాలని అనుకున్నారు.  దాని ప్రకారమే కేసును డీల్ చేసే క్రమంలోనే అనుకోకుండా ఎన్ కౌంటర్ జరిగింది.  దీంతో ప్రజలు తాము కోరుకున్న న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.