ఓటర్లతో కిక్కిరిసిన హైవే !

ఓటర్లతో కిక్కిరిసిన హైవే !

ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్లో ఉన్న ఆంధ్రా ప్రజలు సొంత ఊళ్లకు తరలివెళుతున్నారు.  పెద్ద సంఖ్యలో కార్లు, బస్సులు హైవే మీదికి చేరుకోవడంతో విజయవాడ వెళ్లే ప్రధాన మార్గంలోని పతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయింది.  రెండు గంటల పాటు వాహనాలు ముందుకు కదలక వాహదారులు ఇబ్బందిపడ్డారు.  టోల్ వసూలు చేయకుండా వాహనాల్ని వదలమని ఆందోళన చేస్తున్నారు.