భార్యపై భర్త యాసిడ్ దాడి.. అదే కారణం..!

భార్యపై భర్త యాసిడ్ దాడి.. అదే కారణం..!

భార్యపై భర్తే యాసిడ్ దాడికి పాల్పడడం విశాఖపట్నంలో కలకలం సృష్టించింది... ఈ ఘటనలో తండ్రిని కాపాడేందుకు యత్నించిన కూతురుకు కూడా గాయాలయ్యాయి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని శివాజీపాలెంలో పెయింటింగ్ పనులు చేసే ఈశ్వరరావు, తన భార్య, కూతురితో కలిసి నివసిస్తున్నాడు.. అయితే, భార్యపై ఈశ్వరరావుకు అనుమానం వచ్చింది.. అది పెనుభూతంగా మారుతూ పోయింది.. దాంతో.. ఆమెతో తరచూ గొడవపడేవాడు.. అంతేకాదు.. మద్యానికి కూడా బానిసైపోయాడు.. ఇవాళ ఉదయం మద్యం కోసం డబ్బులు కావాలని భార్యని అడిగాడు.. ఆమె నిరాకరించడంతో.. ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది... అసలే ఆమెపై అనుమానంతో ఉన్న భర్త.. ఆగ్రహంతో ఊగిపోయి.. యాసిడ్ తీసి భార్యపై పోశాడు.. ఇక, తల్లిని కాపాడే ప్రయత్నంలో కూతురికి కూడా గాయాలయ్యాయి. అయితే, అది బాత్రూమ్‌లో వాడే యాసిడ్ కావడంతో పెద్దగా ప్రమాదం లేదంటున్నారు వైద్యులు.. ప్రస్తుతం బాధితులో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.