భార్య నగ్న ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌..

భార్య నగ్న ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్‌..

పెళ్లయి ఒక రోజు గడవక ముందే భార్యకు నరకం చూపించాడో భర్త. భర్త నపుంసకుడని తొలి రాత్రే భార్యకు తెలిసింది. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించిన ఆయన.. ఆమె నగ్న ఫొటోలు తీసి హింసించడం మొదలు పెట్టాడు. తాను సంసారానికి పనికిరాడనే విషయాన్ని బయట పెడితే ఆ నగ్న ఫొటోలను బయట పెడతానని బెదిరించాడు. కొన్నాళ్లు భర్త వేధింపులను భరించిన బాధితురాలు ఈ విషయాన్ని అత్తకు చెప్పింది. ఆమె కూడా కొడుకునే సమర్థించింది. కొడలినే వదిలించుకోవాలనుకుని.. కొడుక్కి రెండో పెళ్లి చేసేందుకు సిద్ధపడింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన త్రివేణి, కర్నూలు జిల్లాకు చెందిన మాచాని రాజేంద్రప్రసాద్‌కు గత ఏడాది వివాహమైంది. త్రివేణి తల్లిదండ్రులు రూ.55లక్షల కట్నం కూడా ఇచ్చారు. పెళ్లయిన రోజు నుంచి భర్త వేధింపులను మౌనంగా భరించిన త్రివేణి.. మరో మార్గం లేక పోలీసులను ఆశ్రయించింది. అల్లుడి దాష్టీకంపై త్రివేణి తల్లిదండ్రులు ప్రశ్నించగా..  త్రివేణికి టీబీ ఉందని, ఆ విషయం దాచి పెళ్లి చేసి.. తన కొడుకు జీవితాన్ని నాశనం చేశారని లేనిపోని నిందలు వేశారు. త్రివేణి ఫిర్యాదుతో పోలీసులు రాజేంద్రప్రసాద్‌పై కేసు నమోదు చేశారు.