భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కి... ఆ భర్త ఏం చేశాడంటే...!!

భార్య కాపురానికి రావడం లేదని టవర్ ఎక్కి... ఆ భర్త ఏం చేశాడంటే...!!

సంగారెడ్డి జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. తన భార్య కాపురానికి రావడం లేదని చెప్తూ లక్ష్మణ్ అనే వ్యక్తి నాగుల్ గిద్ద మండలంలోని కరసగుత్తిలో సెల్ ఫోన్ టవర్ ఎక్కేసాడు.  నారాయణ్ ఖేడ్ మండలం ర్యాలమడుగుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికీ, నాగల్ గిద్ద మండలం మొర్గి కి చెందిన ఓ మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.  అయితే, ఇప్పుడు ఆమె తనతో కాపురం చేయకుండా మరో వ్యక్తితో సహజీవనం చేస్తోందని, తన భార్య తనకు కావాలని, కాపురానికి రాకుండా దూకేస్తానని బెదిరించాడు.  సెల్ ఫోన్ టవర్ ఎక్కి హంగామా చేయడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.  లక్ష్మణ్ ను బుజ్జగించి కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.