ప్రియుడితో భార్య రొమాన్స్... పట్టిచ్చిన గూగుల్ మ్యాప్...!!

ప్రియుడితో భార్య రొమాన్స్... పట్టిచ్చిన గూగుల్ మ్యాప్...!!

గూగుల్ మ్యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించింది. మనం ఎక్కడ ఉన్నాం, మన చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా ఉన్నాయి, చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలను కూడా గూగుల్ మ్యాప్ ద్వారా తెలుసుకునేంతగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది.  ఈ గూగుల్ మ్యాప్ వలన కొందరికి మంచి జరిగితే మరికొందరికి చెడు జరుగుతుంది.  ఎందులోనైనా మంచి చెడులు రెండు ఉంటాయి.  

ఈ గూగుల్ మ్యాప్ ఓ మహిళ అక్రమ సంబంధాన్ని పట్టిచ్చింది.  పెరూ రాజధాని లిమాకు చెందిన ఓ వ్యక్తి సరదాగా గూగుల్ మ్యాప్ లో స్ట్రీట్ వ్యూ చూస్తున్నాడు.  అయితే, ఓ స్ట్రీట్ లో ఓ మహిళ బెంచ్ మీద కూర్చొని ఉండగా, ఆమె ఒడిలో ఓ వ్యక్తి తలపెట్టుకొని కూర్చొని ఉన్న ఫోటో కనిపించింది.  జూమ్ చేసి చూడగా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ను బట్టి తన భార్య అని అర్ధం చేసుకున్నాడు.  దీంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు.  ఇంటికి వచ్చిన భార్యకు గూగుల్ స్ట్రీట్ కు సంబంధించిన ఫోటోను చూపించాడు.  ఆమె నేను కాదని వాదించింది.  మరొకరితో సంబంధంపెట్టుకున్న భార్య తనకొద్దని చెప్పి కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.